సైన్స్ పోటీలలో జిల్లా విజేత సౌజన్య

నవతెలంగాణ – మహాముత్తారం 
సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించకొని  జరుగుతున్న పోటీలలో సోమవారం జయశంకర్ భూ పాలపల్లి జిల్లా  పాటల పోటీల్లో  ములుగు పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని చిర్ర సౌజన్య ప్రతిభ కనబరిచి, జిల్లాలోనే మొదటి బహుమతి పొంది,రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాంకుమార్, రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం పాఠశాల కు గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు శ్రీ పాశం సంజీవరెడ్డి  అన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయికి ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమని, ఇలా నిరంతరం విద్యార్థులలో ప్రతిభను గుర్తించి, అందు కొరకు నిరంతరం వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ములుగు పల్లి పాఠశాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు జోరు సంతోష్ మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లోని ప్రజలలో మూఢనమ్మకాల పట్ల అవగాహన కలిగి, విజ్ఞానం శాస్త్రతో అభివృద్ధి చెందాలని  విద్యార్థులను చైతన్య పరిచే విధంగా బోధిస్తున్నామని అన్నారు. విద్యార్థిని చిర్ర సౌజన్యను ప్రాథమిక ,ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాశం సంజీవరెడ్డి, బోజ్య నాయక్,దాసరి రాజేంద్రప్రసాద్, దేవనేని బాలరాజు, జోరు సంతోష్, మోరె సదానందం, గుగ్గిళ్ళ రమేష్, కుక్కల పున్నం, మోహీన్, రాజు, దేవేందర్ ,బోనాల వెంకటేష్, బాపు రెడ్డి అభినందించారు.