విద్యుత్ షాక్ తగిలి ఆవు మృతి..

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని బిర్మల్ తండాకు చెందిన బస్సీ నార్చోడ్, కండిసింగ్ లకు చెందిన ఆవు గ్రామపంచాయతీ బీర్మల్ తండా చెందిన బోరు బావి వద్ద విద్యుత్ షాక్ తగలడంతో మరణించింది. ఈ నేపథ్యంలో  రైతు మాట్లాడుతూ.. ఆవు గర్భవతిగా ఉందని, ఆవు మృతితో సుమారు రూ.30,000 రూపాయలు నష్టం వాటిల్లిందని  అన్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని రైతు నర్చిడ్ కోరారు.