పిడుగుపాటుతో ఆవు మృత్యువాత 

Cow dies due to lightningనవతెలంగాణ – కోహెడ
పిడుగుపాటుతో పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండలంలోని బస్వాపూర్ పరిధిలోని మూతన్నపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కేడిక కిష్టా రెడ్డి ‌ పాడి ఆవును పొలం వద్ద మేపుతున్న సమయంలో పిడుగు పాటుకు ఆవు మృతి చెందింది. రైతు ‌ మాట్లాడుతూ సుమారు రూ.70 వేలతో ఆవును కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. పిడుగుపాటుకు ఆవు మృతి చెందడంతో ఇకపై జీవనం ఎలా సాగించాలంటూ బోరున విలపించాడు. ప్రభుత్వం రైతు ‌ను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.