
ప్రభుత్వ నుండి అందించే పథకాలలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పథకాలను ప్రజలకు అందించాలని జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గొర్రెల పంపిణీ ఎంపికలలో అర్హులైన లబ్ధిదారులకు అందించకుండా అనుకూలమైన వారికే అందించాలని దురుద్దేశంతో కొంతమంది నాయకులు అర్హులైన లబ్ధిదారుల పేర్లు పక్కన పెట్టి అనుకున్న మారిన వారి పేర్లను ఎంపిక చేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి గొర్రెలను అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.