– సెల్ నెం: 8712659888
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఫిర్యాదు ఉన్నచో సంబందిత పోలీస్ అధికారులను సంప్రదించగలరు అని నిజామాబాద్ పోలీస్ ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ గురువారం తెలియజేశారు. అట్టి ఫిర్యాదు పై చర్యలు తీసుకోనియెడల సంబందిత సి.ఐ కి అట్టి ఫిర్యాదు గురించి తెలియజేయగలరు అని తెలియజేశారు. అక్కడ కూడా చర్యలు తీసుకోనియెడల సంబంధిత ఎ.సి.పి కి అట్టి ఫిర్యాదు గురించి తెలియజేయాలన్నారు. అక్కడ కూడా తగు చర్యలు తీసుకోనట్లయితే చివరికి పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని సెంట్రల్ కాంప్లెంట్స్ సెల్ నెంబర్ 8712659888 కు సంప్రదించగలరు అని తెలియజేశారు. ఇందుకోసం అన్ని పోలీస్ స్టేషన్స్ ముందు భాగంలో ఒక బోర్డు మీద సంబంధిత పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్ పొందపరుచుతూ బోర్డు రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఫిర్యాదు దారులకు సంబంధించిన ఏలాంటి ఫిర్యాదును అయిన సంబంధిత పోలీస్ స్టేషన్స్ యందు సంప్రదించగలరు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదతో మాట్లాడి వారి ఫిర్యాదును త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సిందూ శర్మ, ఐ.పి.యస్. ఆదేశాలు జారీ చేశారు.