నవతెలంగాణ-బేగంపేట్
ఏదైనా ఆపద వస్తే ఆదుకోవాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాం.. కానీ ఆ పోలీసే ఆపద కలిగిస్తే.. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సనత్‌నగర్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకెళ్తే.. సనత్‌నగర్‌లో నివాసముండే ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఓ విషయమై ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఫిర్యాదు చేసిన అనంతరం మహిళా ఫోన్ నంబర్ తీసుకున్న ఇన్‌స్పెక్టర్ పురేం దర్రెడ్డి ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అందంగా ఉన్నావని.. చెప్పిన ప్లేస్‌కు వస్తావా అని అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడు. తాను అలాంటి దాన్ని కాదని బాధితురాలు చెప్పినా ఇన్‌స్పెక్టర్ వినిపించుకోలేదు. దాంతో విసిగిపోయిన బాధిత మహిళ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసి ఇన్‌స్పెక్టర్ పంపిన మేసేజ్‌లను చూపించి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన సీపీ సదరు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.