పట్టణంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న ప్రజల నుండి అనుమతుల కొరకు కౌన్సిలర్లు అక్రమంగా యాభై వేయల నుండి లక్ష రూపాయల వరకు వసులు చేయడం మానుకోవాలనీ కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆరెపల్లి సాయిలు అన్నారు. పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం అయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు వార్డ్ అభివృద్ధి కీ సహకరిస్తారని ఎంతో నమ్మకముతో మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపిస్తే బరితెగించి డబ్బులు వసూలు చేయడం ఏంటని అయన తీవ్రంగా మండిపడ్డారు దీనిపై ప్రజలకు మున్సిపల్ కమిషన్ సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పేద మధ్యతరగతి ప్రజలు అప్పులు తెచ్చుకుని సొంతయింటి కలను నేరవేర్చుకోవాలని ఆశతో ఉన్నా వారిపై బలహీనతను ఆసరాగా తీసుకొని డబ్బులు వసూలు చేయడం ఏంటనీ. ఒకపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ వేస్తుంటే మరోపక్క కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేయడం ఏంటని ఆయన అన్నారు.. తక్షణమే దీనిపై కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో.. కమలపురం రాజన్న.సీను. నరేష్. రాజు. మంగ.తదితరులు పాల్గొన్నారు.