సీపీఐ ఎవరికి సహకరించాలో నిర్ణయించలేదు

నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జాతీయ రాష్ట్ర పార్టీలు నిర్ణయించలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గత రెండు మాసాల నుండి ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు పార్లమెంటు స్థానాలు సీపీఐ గుర్తించినదని ఇందులో ఒక పార్లమెంటు స్థానం సీటు సీపీఐకి కేటాయించాలని మా పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రతిపాదన పంపినారని తెలిపారు. పరిశీలిస్తున్నామని చెబుతూనే ఇప్పటికీ కాంగ్రెస్ నుండి మా పార్టీకి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. మన రాష్ట్రంలో సీపీఐ  ఎవరికి సహకరించాలో నిర్ణయించలేదు. మత రాజకీయాలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్న బీజేపీని ఓడించాలని ఇండియా కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.