కూలీలకు జీవన భృతి ఇవ్వాలి: సీపీఐ ఎంఎల్ డిమాండ్..

నవతెలంగాణ – గాంధారి
ఇచ్చిన మాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వంవ్యవసాయకూలీలకుజీవనభృతిఇవ్వాలివ్యవసాయ కూలీల సమగ్రమైన చట్టము తేవాలనిఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన  12 వేల రూపాయల పెన్షన్ ను అమలు చేయాలి. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(సీపీఐ ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపందా జిల్లా నాయకులు ఏ ప్రకాష్ డిమాండ్ చేశారు. సోమవారము నాడు గాంధారి మండలంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తధానంతరం తహసీల్దార్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈసందర్బం గా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 59% శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. ఇందులో రెక్కలు తప్ప ఎలాంటి ఆస్తులు లేని  14 కోట్ల మంది వ్యవసాయ కార్మికులే ఉన్నారు. నారు పోసిన నుండి కోత కోసే వరకు వివిధ రకాలుగా పనులు చేస్తూ  శ్రమనునమ్ముకునిజీవిస్తున్న వ్యవసాయ కార్మికులు చాలీ,చాలని వేతనాలతో  బ్రతుకీడుస్తున్నారు. సరి అయిన పని లేక తక్కువ ఆదాయంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. వ్యవసాయ రంగం లో యాంత్రికరణ  జరగడంతో ఉపాధి కోల్పోయి  దిక్కుతోచని  అయోమయ మైన పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. రోజురోజుకు  వీరి పరిస్థితి దయ నీయంగా మారింది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు కేంద్రంలో అధికారం లో ఉన్న మోడీ ఉపాధిహామీ పథకానికి నిధుల్లో కోత విధించడంతో వ్యవసాయ కార్మికుల పరిస్థితి మరింత గడ్డు పరిస్థితుల్లోకి  నెట్టబడింది. రోజురోజు పెరుగుతున్న నిత్యవసర ధరల అనుగుణంగా రూ.600 రూపాయల  కూలిని పెంచాలని, మేముఅనేక  ఆందోళనలు నిర్వహించిన భారత ప్రధాని  మోడీకి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉంది ఆయన అన్నారు. కార్పొరేట్లకు పదేళ్లలో  రూ.30 కోట్ల  రుణాలు మాఫీ చేశారు. రెక్కలు తప్ప ఆస్తులు లేని వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి పూనుకోకుండా  ఎగనామం పెట్టారు.  దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ కూలీలను ప్రత్యేక వర్గంగా గుర్తించి వీరి సంక్షేమానికి  కృషి చేయాలని ఏఐపీకేఎంఎస్  డిమాండ్ చేస్తున్నది. ముఖ్యంగా వీరికి సమగ్రమైన వ్యవసాయ కార్మిక చట్టం తెచ్చి , 50 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు పదివేల రూపాయలు చొప్పున పెన్షన్ అందించాలని,అన్ని రకాల రోగాలకు వర్తించే హెల్త్ కార్డు అందించి ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించి రూ.10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయకూలీ ల్లో అధిక భాగంమహిళలే.కూలీపనుల్లో, వేతనాలు చెల్లింపుల్లోవివక్షత తప్పడం లేదు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు వ్యవసాయ కార్మికుల పట్ల  మానవత దృక్పథంతో ఆలోచించి  తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నాం.రెక్కలు తప్ప ఆస్తులు లేని వ్యవసాయకార్మికులకు సంవత్సరానికి రూ.12వేల జీవనభృతి దేనికి సరిపోదని బీడీ కార్మికులకు, గీతా కార్మికులకు, ఇస్తున్నట్టుగా నెలకు రూ.2016 రూపాయలు ఇవ్వాలని, బీడీ,గీతా కార్మికులకు ఎన్నికల సందర్భంగా  రేవంత్ రెడ్డి  ఇచ్చిన హామీ నాలుగు వేలకు పెంచుతామని హామీని కూడా వ్యవసాయ కార్మికులకు వర్తింపజేయాల ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో (సీపీఐ ఎంఎల్) మాస్ లైన్అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం.(ఏఐపీకేఎంఎస్) మండల నాయకులు  శంకర్ రాజు, రాజేందర్ చందర్అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం.(ఏఐపీకేఎంఎస్) మండల నాయకులు ,  తదితరులు పాల్గొన్నారు.