కొత్తగూడెంలో సీపీఐ ప్రజాపోరుబాట యాత్ర ముగింపు

– పోస్టర్‌ ఆవిష్కరించిన నాయకులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సీపీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజా పోరు బాట యాత్ర ముగింపు కొత్తగూడెం ముగుస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకులు ఓరుగంటి యాదయ్య తెలిపారు. ఈ యా త్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహి రంగసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేర కు ఇబ్రహీంపట్నంలో గోడ పత్రికను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభ కు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలు పునిచ్చారు. ప్రజా సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా వందలాది యాత్రలు సీపీఐ ఆధ్వర్యంలో జరిగాయన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి పూల యాదయ్య, మం చాల మండల కార్యదర్శి రాజునాయక్‌, సీనియర్‌ నాయ కులు ఆల్లిమొదిన్‌, అనంతరెడ్డి, విజయ కుమార్‌, బండ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.