లాస్యనందిత మరణం పట్ల సీపీఐ దిగ్భ్రాంతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణించడం విషాదకరమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె తండ్రి సాయన్న మరణించిన ఏడాదికే ఆమె మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చడం బాధాకరమని పేర్కొన్నారు. ఆమె మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.