మత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తాం: సీపీఐ

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో హత్యకు గురైన కొల్లు నర్సిరెడ్డి  ప్రధమ వర్ధంతి సభ గురువారం చేగూరి పాపయ్య అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గోదా శ్రీరాములు సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్గొని గ్రామంలో స్తూపం ఆవిష్కరించి జండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ  హత్యకు గురిఅయిన నర్సిరెడ్డి హత్యకు కారకులైన వారికి శిక్ష విధించాల్సిన అవసరం ఉందని  అన్నారు. నర్సిరెడ్డి  గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని, మాజీ శాసనసభ్యులు గుర్రం యాదగిరి రెడ్డి  అనుచరులుగా ఉండి రైతుల కు ట్రాన్స్ ఫార్మర్లు, నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయించారని అన్నారు. గ్రామంలో పక్కా రోడ్లు కోసం కృషి చేశారని అన్నారు. గ్రామంలో మండలంలో పార్టీ కోసం నిర్మాణం చేయుటకు కార్యకర్తలని సంసిద్ధం చేశారని అన్నారు. మోడీ మత రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని పలు రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు సామాజిక కార్యకర్తలపై దాడులు, హత్యలు చేస్తున్న చర్యలు తీసుకోవటం లేదన్నారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్ మాట్లాడుతూ సమ సమాజం నిర్మాణం కోసం నర్సిరెడ్డి  అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, నర్సిరెడ్డి భార్య కుమారులు ఇందిర, శంకర్, రైతు సంఘం జిల్లా నాయకులు పైళ్ళ యాదిరెడ్డి, ఎలగందుల అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంజి వీరస్వామి,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్,సల్వాద్రి రవీందర్,నరీగే యాదయ్య, మచ్చ లక్ష్మీనారాయణ, సుద్దాల సాయికుమార్, మేడి దేవేందర్, రాచమల్ల శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.