బహిరంగ సభను జయప్రదం చేయాలి: సీపీఐ(ఏం)

Public meeting should be championed: CPI(M)– ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లా కేంద్రంలోని బాశెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం, సీఐటీయూ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలనీ సీపీఐ(ఏం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను బుధవారం సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ నెల 28న ఆర్అండ్‌బీ అతిథిగృహం వ‌ద్ద బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. సభకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ… కార్యక్రమ ముఖ్య అతిథులుగా సీపీఎం పొలిట్‌బ్యూరో స‌భ్యురాలు బృంద కార‌త్‌తో పాటు సీఐటీయూ ఆల్ ఇండియా నాయ‌కులు సాయిబాబ, సీపీఎం మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు మిడియం బాబురావు, చెరుప‌ల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పాల‌డుగు భాస్క‌ర్‌ తదితరులు హాజరు కానున్నారని తెలిపారు. ఉద‌యం ప‌ది గంట‌ల‌కు కార్యాల‌య ప్రారంభోత్స‌వం అనంత‌రం ర్యాలీగా బ‌హిరంగ స‌భ వేదిక వ‌ద్ద‌కు చేరుకోనున్నట్లు వివరించారు. సభలో భాగంగా ప్రజా, కార్మిక, కర్షక సమస్యలపై చర్చించి. భవిష్యత్ ఉద్యమ కార్యాచరనను నిర్ణయించనున్నామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.