
నవతెలంగాణ కంఠేశ్వర్
సీపీఐ(ఎం) అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారామ ఏచూరి మృతికి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటి తీవ్ర దిగ్భ్రాంతిని సిరిగాద సిద్దిరాములు వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఐ(ఎం) అఖిలభారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి చెందడం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వామపక్ష ఉద్యమానికి తీరనిలోటుగా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటి భావిస్తున్నదిని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిరిగాద సిద్దిరాములు తెలిపారు. ఆయన ఆయన మృతి భారతదేశ వామపక్ష ఉద్యమానికి కోలుకోలేని దెబ్బలాంటదనన్నారు.