ప్రజా సమస్యలపై నిత్యం సీపీఐ(ఎం) పోరాటాలు..

On public issues Constant CPI(M) struggles..– రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్‌ చుక్క రాములు
– మహాసభలకు రూ.12 లక్షల విరాళం
– అందించిన టీఐడీసీ కార్మికులు
నవతెలంగాణ-పటాన్‌చెరు
ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) నిత్యం ఉద్యమిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్‌ చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్‌భవన్‌లో టీఐడీసీ కార్మికులు మహాసభల కోసం విరాళంగా రూ. 12 లక్షలా ఆరు వేల చెక్‌ను చుక్క రాములుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పోరాటాలను బలోపేతం చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్మిక హక్కుల కోసం సీపీఐ(ఎం) ఎల్లవేళలా ఉద్యమిస్తోందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ తదితర సమస్యలపై పోరాడుతున్నదన్నారు. సీపీఐ(ఎం) నాయకత్వం వహిస్తున్న చోటనే కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తున్నారన్నారు. సంగారెడ్డిలో తొలిసారిగా రాష్ట్ర మహాసభలు జరుగుతుండడంతో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రాజయ్య, టీఐడీసీ కార్మికులు భాస్కర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, వెంకటేశ్వర్లు, సత్తయ్య, సుధాకర్‌ గౌడ్‌, జామి శ్రీను, భద్రం, శ్రీరాములు, వాసు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.