సీపీఐ(ఎం) అనకాపల్లి జిల్లా నాయకులు బాలకృష్ణ కన్నుమూత

సీపీఐ(ఎం) అనకాపల్లి జిల్లా నాయకులు బాలకృష్ణ కన్నుమూత– ఏఎంసీకి భౌతికకాయం అప్పగింత
అనకాపల్లి : సీపీఐ(ఎం) ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అంగులూరి బాలకృష్ణ (65) అనారోగ్యంతో విశాఖ కెేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున కన్ను మూశారు. ఆయన భౌతికకాయాన్ని అనకాపల్లిలోని దాసరిగెడ్డ రోడ్డు గవరపాలెంలో ఉన్న స్వగహానికి తరలించారు. అక్కడి నుంచి సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తీసుకొచ్చారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం విశాఖపట్నం జగదాంబ సమీపంలోని సీపీఐ(ఎం) కార్యాల యానికి తీసుకొచ్చి కొద్దిసేపు ఉంచారు. ఆ తర్వాత ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి భౌతికకాయాన్ని అప్పగించారు. ఆయ నకు భార్య వరలక్ష్మి, కుమారుడు వెంకట సత్యప్రసాద్‌ (కౌశిక్‌) ఉన్నారు.