
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం శంకరపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై తహసిల్దార్ అనుపమ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వెల్మ రెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎన్నికలల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అలాగే మాహ లక్ష్మి పథకంలో భాగంగా 18 సంవత్సరాల నిండిన మహిళలకు నెలకు రూ. 2500 చొప్పున ఇవ్వాలని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నెల రోజులు గడిచిన పెట్టుబడి సాయం అన్నదాతకు అందలేదన్నారు. వెంటనే రైతు భరోసా పథకం ద్వారా ఖరీఫ్ సీజన్ ఎకరానికి రూ. 7500 రైతు అకౌంట్లో వేయాలని అన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు రూ.15000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో వేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయాలని అన్నారు. ఎవరికి కేటాయించిన ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదవారికి పంపిణీ చేయాలని అన్నారు. ఇంటి స్థలం లేని వారికి 200 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు.
నిరుద్యోగ భృతి రూ.3116 ఇవ్వాలని అన్నారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటినుండి నేటి వరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. రైతు పండించిన అనేక రకాల పంటలకు రూ.500 రూపాయలు బోనస్ వెంటనే ఇవ్వాలి. ఆన్లైన్ ఇబ్బందులతో గృహజ్యోతి పథక అర్హులైన వారికి పెండింగ్లో ఉన్నాయి. వాటి అమలు చేయాలి ధరణి భూ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ప్రైవేట్ ఆస్పత్రిలో దోపిడిని అరికట్టాలి పైన పేర్కొన్న హామీలు వాగ్దానాలు అన్ని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినదే ఈ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వెల్మ రెడ్డి రాజిరెడ్డి,మండల నాయకులు ఇమ్మడి చక్రపాణి, ఖమ్మం విజయరాములు, ఏం యుగంధర్, పిట్టల తిరుపతి, రాచర్ల బుచ్చయ్య, ఐలయ్య,వెంకటేశు,తదితరులు పాల్గొన్నారు.