సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవర్గ సమావేశం జయప్రదం చేయండి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ  పిలుపు
నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 5వ తేదీన భువనగిరి పట్టణంలోని ఎస్.ఎల్.ఎన్.ఎస్ ఫంక్ష హాల్లో భువనగిరి పార్లమెంటు యోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి యండి. జహంగీర్  గెలుపు కోసం నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవర్గం సమావేశంలో పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చినారు. బుధవారం భువనగిరిలోని సీపీఐ(ఎం) పట్టణ కార్యాలయంలో ముఖ్యుల  సమావేశంలో అనురాధ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టి వారి ద్వారా డబ్బులు దండుకొని ఆ డబ్బుల ద్వారా ప్రజలనుండి ఓట్లు కొనుగోలు చేసి మరోసారి గద్దెనెక్కాలని చూస్తుందని విమర్శించారు. రాజ్యాంగ విలువలు పౌర హక్కులను కాలరాయాలను చూస్తూ లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ మనువాద సిద్ధాంతాన్ని తేవాలని కుట్రలు చేస్తున్నదని అన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని అదోగతు పాలు చేసిన బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని అన్నారు. ఈ ప్రాంతము అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటి ప్రశ్నించి గొంతు పోరాడే నాయకుడు సీపీఐ(ఎం) అభ్యర్థి యండి.జహంగీర్ ను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. భువనగిరిలో నిర్వహిస్తున్న సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ , సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ , సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి  పార్లమెంటు అభ్యర్థి యండి.జహంగీర్  పాల్గొంటున్నారని తెలియజేశారు . ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య, పట్టణ కమిటీ సభ్యులు బందెల ఎల్లయ్య, వల్దాసు అంజయ్య పాల్గొన్నారు.