కార్మికుల గొంతుగా నిలుస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి యండి జహాంగీర్ ను గెలిపించాలి

– కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజేపీని ఓడించాలి
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
నవతెలంగాణ – భువనగిరి
కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజేపీని ఓడించి కార్మికుల గొంతుగా నిలుస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి యండి జహాంగీర్ ను గెలిపించాలనీ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్  అన్నారు. సోమవారం స్థానిక దుంపల మల్లారెడ్డి భవన్ లో జిల్లా అద్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన సీఐటీయూ ఆద్వర్యంలో పార్లమెంటు ఎన్నికలు-కార్మికుల కర్తవ్యాలు అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్ కు ముఖ్య వక్తగా రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ తో కలిసి హాజరై  మాట్లాడుతూ బిజేపి అధికారం చేపట్టాక కార్పోరేట్లకు, బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కార్మికవర్గాన్ని అగాదంలోకి తోసిందన్నారు. నూతన లేబర్ చట్టాలను తీసుకువచ్చి కార్మికుల జీవితాలపై దాడి చేస్తూందన్నారు. మతం పేరుతో మనుషుల మద్య వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడకుండా అనైక్యతను పెంచి పోషిస్తుందన్నారు. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారం చేపడితే భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూందన్నారు. నిత్యం కార్మికుల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న వామపక్ష పార్టీ సీపీఐ(ఎం) కు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అనేక కార్మిక ఉద్యమాలకు సారధ్యం వహించిన భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి యం.డి జహాంగీర్ ను కార్మికులు అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్మికుల గొంతును పార్లమెంటుకు పంపాలంటే సంఘటిత,అసంఘటిత కార్మికులు సీపీఐ(ఎం) కు ఓటు వేయాలని అన్నారు. నిబద్దతగా  గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలకు సారధ్యం వహిస్తు అనేక సీఐటీయూ పోరాటాలకు మద్దతుగా నిలిచిన జహాంగీర్  గెలుపు కార్మికవర్గం గెలుపుగా అభివర్ణించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ రాష్ట్ర నాయకులు రఘు పాల్ గారు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా , గోరిగే  సోములు, సిలివేరు రమాకూమరి, జిల్లా సహాయ కార్యదర్శులు బోడ ఉదయ భాగ్య ,మాయ కృష్ణ, తుర్కపల్లి సురేందర్,సుబ్బూరి సత్యనారాయణ, మిషన్ భగీరథ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పసమిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి,జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం,పోతరాజు జహంగీర్ ర్ ఆదిమూలం నందీశ్వర్, మొరిగాడి రమేష్, బత్తుల దాసు, జిల్లా నాయకులు తూటి వెంకటేష్, సంగీరాజు, శ్రీనివాస్ రెడ్డి వివిధ రంగాల నుండి జిల్లా నాయకత్వం  తదితరులు పాల్గొన్నారు.