నామినేషన్ దాఖలు చేసిన సీపీఐ(ఎం)అభ్యర్ధులు

నవతెలంగాణ – అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్ర సాధారణ అసెంబ్లీ 2023 లో జరుగుతున్న ఎన్నికలకు అశ్వారావుపేట నియోజక వర్గం సీపీఐ(ఎం) అభ్యర్ధి గా అర్జున్ రావు పిట్టల గురువారం నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. అర్జున్ రావు అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య బీ.ఫాం అందజేసారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అర్జున్ రావు అభ్యర్ధిగా ప్రపోజ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అప్పారావు, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు. అనంతరం డమ్మి అభ్యర్ధిగా గొగ్గెల ఆదినారాయణ నామినేషన్ వేయగా ఆయన వెంట జిల్లా కమిటీ సభ్యులు అన్నవరం సత్యనారాయణ, శివరాం ప్రసాద్, జ్యోతి, ముదిగొండ రాంబాబులు పాల్గొన్నారు.