నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రపంచంలో కార్మికులకు,కార్మికులకు,కష్ట జీవులకు కమ్యూనిస్టు పార్టీలే రక్షణ కవచాలు అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని మొద్దులు గూడెం లో గ్రామ శాఖల మహా సభలను మండల కమిటీ సభ్యులు నారం అప్పారావు అద్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ పార్టీ ప్రతీ సభ్యుడు ప్రజలతో మమేకం అయితేనే స్థానికంగా పార్టీ బలపడుతుందని అన్నారు. ఈ మహాసభల్లో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ ప్రస్తుత రాజకీయాలు – పార్టీలు విధానాలు పై రాజకీయ రిపోర్ట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముందుగా సీనియర్ నాయకులు నారం చిన వెంకటేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి కి నివాళులు అర్పించారు. ఇందులో మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.