సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్యా నాయక్

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతలమండలం రాయిచెడ్ గ్రామంలో శనివారం సీపీఐ(ఎం) శాఖా సమావేశానికి సీనియర్ కామ్రేడ్ గొడుగు చంద్రయ్య అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ శాఖా సమావేశానికి ముఖ్య అతిధి గా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్యా నాయక్ హాజరై మాట్లాడారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణా ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఫిబ్రవరి 10న ఇందిరా పార్క్, హైద్రాబాద్ లో ప్రజాసంఘాల మహాధర్నా ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు యస్.మల్లేష్, మండల కార్యదర్శి చింతల. నాగరాజు,సీనియర్ నేత శివకుమార్, గ్రామ శాఖా కార్యదర్శి గొడుగు. వెంకటయ్య,  నాగయ్య గౌడ్, సభ్యులు తిరుపతయ్య, లక్ష్మయ్య, శ్రీనయ్య, రామకృష్ణ,రమేష్, అంజి పాల్గొన్నారు.