
యూటీఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు ఉద్యమ నేత నల్లబెల్లి బలరాం భౌతిక కాయానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో హనుమాన్ నగర్ లో స్వగృహంలో నల్లబెల్లి బలరాం గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి మాట్లాడుతూ.. చిన్ననాటి నుండి వామపక్ష భావాలు పునికి పుచ్చుకొని అసమానతులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి బలరాం అని ఎండి జంగీర్ అన్నారు. పేదరికం నుండి పట్టుదలతో విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేస్తూనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ రంగ సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహించిన నిబద్దతగల వ్యక్తి బలరాం సార్ అని కొనియాడారు. ఉపాధ్యాయ రంగ సమస్యలపై కొట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షునిగా పని చేసి ఉపాధ్యాయులకు అండగా నిలిచి ఉపాధ్యాయ మన్నలను పొందిన నిబద్ధతగల వ్యక్తి బలరాం సార్ అన్నారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గంగాదేవి సైదులు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం డీవైఎఫ్ఐ ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ నాయకులు రాగిరి కిష్టయ్య,ఆదిమూలం నందీశ్వర్, అవ్వారు గోవర్ధన్,బోయ యాదయ్య,రత్నం శ్రీకాంత్,నేరడి మహేష్,తీగుల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.