ఉప్పునుంతల మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పాలస్తిన దేశంపై ఇజ్రాయిల్ దేశం చేస్తున్న యుద్ధాన్ని ఆపి శాంతి సామరస్యాన్ని నెలకొల్పాలని సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి వి పర్వతాలు డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ దేశం యొక్క దురాక్రమణను ఆపి పాలస్తీనకు బాసటగా యావత్ ప్రపంచం నిలవాలని కోరుతూ ఇజ్రాయిల్ దేశ దురాక్రమణ పై సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ… ఇజ్రాయిల్ దేశం పాలస్తీల దేశం పై యుద్ధం ప్రారంభించి సంస్థ కాలం పూర్తి కావస్తుంది ఇప్పటికీ 50వేల మంది మరణించారు. పదివేల మంది క్షేత్రగాత్రులు గాయాలపాలై ఆసుపత్రిలో వైద్యం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితిగా మారింది ఐక్యరాజ్యసమితి చెప్తున్న పెడచెవిన పెడుతూ యుద్ధం చేస్తూ ఆ దేశ ప్రజలపై దాడులు చేసి చంపడం దుర్మార్గం అని అన్నారు. ఇప్పటికైనా పాలస్తీనా ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తున్న ఇజ్రాయిల్ దేశం ముండిగ వ్యవహరించడం తగదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేస్య నాయక్, చింతా ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, మండల కార్యదర్శి నాగరాజు, మండల నాయకులు హుస్సేన్, రాములు, బాలయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.