నవతెలంగాణ మునుగోడు: కొరటికల్ గ్రామంలో పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడిన బోడిష సత్తయ్య సేవలు మరువలేనివని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు మండల పరిధిలోని కోరేటికల్ గ్రామంలో బోడిష సత్తయ్య స్మారక స్తూపావిష్కరణ కార్యక్రమానికి హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొరటికల్ గ్రామంలో పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడిన వ్యక్తి సత్తయ్య అనివారు కొనియాడారు. నేడున్న సమాజంలో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, నీతి నిజాయితీకి పేదల పక్షన రాజీ లేని పోరాటలు చేశారనివారు అన్నారు.
డబ్బులకు మధ్య ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బులకు, మద్యానికి అమ్ముడుపోయే సమాజంలో అక్రమాలకు తావు ఇవ్వకుండా, శత్రువులకు లొంగకుండా ఎర్ర జెండా నే నమ్ముకొని, దోపిడీకి, పాలక ప్రభుత్వాలవిధానాలకు వ్యతిరేకంగాప్రజలని సమీకరించిముందు నడిపించిన వ్యక్తి సత్తయ్య అని వారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ, సీపీఐ(ఎం) పార్టీ ఈ గ్రామంలో 90, 91 లో ప్రారంభించినాటి నుంచి నేటి వరకుప్రజా సమస్యల పరిష్కారం కోసంనికరంగా పోరాడిన వ్యక్తిసత్తయ్య అని వారు అన్నారు. పార్టీ శాఖ కార్యదర్శిగా, మండల కమిటీ సభ్యునిగా, రైతు సంఘం నాయకునిగా, పాల సంఘం డైరెక్టర్ గా రెండు పర్యాయాలు ఎన్నికై రైతుల సమస్యల కోసం పాల సంఘంలో అక్రమాలను వెలికి తీసిన వ్యక్తి సత్తయ్య అని వారన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం జిల్లా నాయకులు మల్గయాదయ్య సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులునాంపల్లి చంద్రమౌళి,మండల కార్యదర్శిలుఏర్పుల యాదయ్య, బీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్, మొగుదాల వెంకటేశం, మండల సహాయ కార్యదర్శి లు వరికుప్పల ముత్యాలు, జెర్రిపోతుల ధనంజయ్య, సీపీఐ నాయకులు మందుల పాండు, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, చిట్టి మల్ల లింగయ్య, మహేందర్ సత్తయ్య కుమారుడు మహేందర్, గ్రామ నాయకులుబొడ్డుపల్లి యాదగిరి, దొండ వెంకన్న, బోడిష నరసింహ, మల్లేష్, బోడిష శివ, బోడిష యాదయ్య తదితరులు పాల్గొన్నారు.