
భువనగిరి జిల్లా భువనగిరి పట్టణములో తాత నగర్ లోని సర్వే నెంబర్ 1064 అ/1.. గల భూమిలో గోరీలను అక్రమముగా తొలగించి జేసీబి చదును చేసి కబ్జా చేయడానికి మందులు లక్ష్మారెడ్డి తండ్రి పద్మా రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు పూర్వీకుల నుంచి గోరీలను సంక్రమించిన భూమిని కొందరు కబ్జా చేశారంటూ అక్కడున్న భూమిని పరిశీలించారు. రెవెన్యూ అధికారులు సమస్యను స్పందించి భూమిని సర్వే చేసి ప్రైవేట్ భూమి ప్రభుత్వం భూమి అని చూసి ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. తక్షణమే ఆ పనులను ఆపేసి అక్రమంగా నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. ఇంత ముందు ముదిరాజు, గంగపుత్ర కులస్తులు ఆందోళన చేయుచున్నారని అన్నారు. దీనిపై స్పందించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్ ,సిపిఎం నాయకులు ఈర్ల రాహుల్, రియాజ్, సాజిత్, భవాని శంకర్ ,సతీష్, మరియు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.