దూప్‌గురి: పశ్చిమ బెంగాల్‌లోని దూప్‌గురి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఈశ్వర్ చంద్రరారుకి మద్దతుగా ఆ పార్టీ ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించింది. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడంతోపాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో టీఎంసీ హింసాకాండను, బీజేపీ మతతత్వ రాజకీయాలను ఓడించాలని, సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సుజన్ చక్రవర్తి, రాష్ట్ర నాయకులు జీవేష్ సర్కార్, సలీల్ ఆచార్య, మీనాక్షి ముఖర్జీ, ధృవజ్యోతి సాహ తదితరులు పాల్గొన్నారు.