బీజేపీ ప్రభుత్వ విధానాలపై… సీపీఐ(ఎం) నిరంతర పోరాటాలు

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్‌
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో పార్టీ మండల కమిటీ సమావేశం గురువారం రాత్రి గుగులోతు పంతు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఎం మధిర నియోజకవర్గ ఇన్చార్జి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిపిఎం కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి వెళ్లి సమస్యలపై సర్వే నిర్వహించి ఆ సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని కోరారు. బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టిన ప్రతిపక్ష ప్రభుత్వాలపై సిబిఐ ఈడి వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి తన మతోన్మాద అహంకారాన్ని బయటపెట్టుకుంటుందని విమర్శించారు. బిజెపికి మతతత్వం కుల తత్వాలను రెచ్చగొట్టడం ప్రజల మధ్య చిలుక తీసుకురావడం ఒక ఎజెండాగా పెట్టుకుందని వారు విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు మండల కమిటీ సభ్యులు తెల్లాకుల శ్రీనివాసరావు, కొంగర భూషయ్య, మంద వీరభద్రం, ఎర్రగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : మండల కేంద్రంలోని రామ్‌ శెట్టి పుల్లయ్య భవనం నందు సగ్గుర్తి సంజీవరావు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో ఎర్ర జెండా గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, అందుకోసం ఇప్పటి నుండి స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి దివ్యల వీరయ్య, నల్లమోతుల హనుమంతరావు, షేక్‌ నాగుల్‌ మీరా, రామిశెట్టి సురేష్‌, నాగులవంచ వెంకట్రామయ్య, తోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నా రు.