తమిళనాడులో రెండు స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ

తమిళనాడులో రెండు
స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ– మదురై, దిండిగల్‌లో డీఎంకేతో పొత్తు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని రెండు నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) పోటీ చేయనుంది. మదురై, దిండిగల్‌ స్థానాలకు ఇండియా ఫోరంలో భాగంగా డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. గతసారి కోయంబత్తూరు, మదురైలో సీపీఐ(ఎం) పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కోయంబత్తూరు స్థానంలో కాకుండా దిండిగల్‌ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మదురైలో యధాతథంగా పోటీ చేస్తుంది.