– కార్యదర్శిగా నున్నా నాగేశ్వరరావు
– 42 మందితో జిల్లా కమిటీ.. 11 మందితో కార్యదర్శివర్గం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీపీఐ(ఎం) జిల్లా 22వ మహాసభలు అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో గురువారం విజయ వంతంగా ముగిశాయి. స్థానిక సిద్ధారం రోడ్డులోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో 42 మందితో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో 11 మందితో జిల్లా కార్యదర్శి వర్గాన్ని ఎంపిక చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా మూడోసారి నున్నా నాగేశ్వర రావు ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు.
ఆయనతో పాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వర రావు, బండి రమేశ్, భూక్యా వీరభద్రం, యనమదల విక్రమ్, బొంతు రాంబాబు, బండి పద్మ, యర్రా శ్రీనివాస రావు, మాదినేని రమేశ్ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా మెరుగు సత్యనారాయణ, బండారు రమేశ్, తుమ్మా విష్ణువర్దన్, పారుపల్లి ఝాన్సీ, పిన్నింటి రమ్య, నందిపాటి మనోహర్, మడుపల్లి గోపాలరావు, శీలం సత్య నారాయణరెడ్డి, తాళ్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ, నండ్ర ప్రసాద్, ఊరడి సుదర్శన్‌రెడ్డి, కొమ్ము శ్రీని వాస్, గుడవర్తి నాగేశ్వర రావు, శీలం నర్సింహారావు, దొండపాటి నాగేశ్వరరావు, దివ్వెల వీరయ్య, కొండ బోయిన నాగేశ్వరరావు, మోరం పూడి పాండురంగా రావు, చలమల విఠల్, సుంకర సుధాకర్, ఎంఏ జబ్బార్, దొంగల తిరుపతిరావు, సంగబత్తుల నవీన్‌రెడ్డి, షేక్ బషీరుద్దీన్, మెరుగు రమణ, బట్టు పురుషోత్తమ్, మందా సైదులు, షేక్ మీరాసాహెబ్, మల్లెల హనుమంతరావు, జాజిరి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.