శ్రీకాకుళం : సీపీఐ(ఎం) శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాతృమూర్తి మహాలక్ష్మి (87) బుధవారం వేకువజామున మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రాగోలులోని జెమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
ఆమె అంత్యక్రియలు స్వగ్రామం కోటబొమ్మాళి మండలం జగన్నాథపురంలో నిర్వహించారు. మహాలక్ష్మికి కుమారులు గోవిందరావు, రామారావు, కుమార్తెలు పద్మావతి, ధనలక్ష్మి, శర్వాణి ఉన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, జి.సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, ప్రజా, కార్మికసంఘాల నాయకులు, కార్యకర్తలు మహాలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మహాలక్ష్మి మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.