సీపీఐ(ఎం) నాయకురాలు జూపల్లి రాధా వర్థంతి

నవ తెలంగాణ -భువనగిరి రూరల్‌
మండలంలోని అనాజిపురం గ్రామ సీపీఐ(ఎం) నాయకురాలు జూపల్లి రాధా నాలుగో వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి బుధవారం ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని అనేక సమస్యల పై చేసిన పోరాటాల్లో రాధ పాత్ర మరువలేనిదని విద్యా కమిటీ చైర్మెన్‌గా స్కూల్‌ డెవెలప్‌మెంట్‌్‌ కోసం కషి చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఎదునూరి ప్రేమలత మల్లేష్‌ ,ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన శ్రీనివాస్‌ , మాజీ సర్పంచ్‌ బొల్లెపల్లి కుమార్‌, ఉప సర్పంచ్‌ మైలారం వెంకటేష్‌, పార్టీ గ్రామశాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్‌, కో ఆప్షన్‌ సభ్యులు 1శాఖ కార్యదర్శి ఎదునూరి వెంకటేష్‌, వార్డుమెంబెర్స్‌ పిట్టల వెంకటేష్‌ ,మామిడాల శ్రీనివాస్‌, నాయకులు కడారి క్రిష్ణ, బోల్లేపల్లి వెంకట స్వామీ, కడారి పోశాలు,ఆకుల భిక్షపతి,కుటుంబ సభ్యులు భర్త సత్తయ్య, కొడుకు కోడలు వెంకటేష్‌ పూజిత ,నవీన్‌ మరియు కవిత,సువర్ణ, సిద్దమ్మ, అండాలు, పద్మ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.