స్థానిక శాసనసభ్యులు మందుల సామేలను కలిసి శుభాకాంక్షలు: సీపీఐ(ఎం) నాయకులు

నవతెలంగాణ – తుంగతుర్తి
మలిదశ ఉద్యమ నాయకుడు, కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, మాతోపాటు ప్రజల పక్షాన నిలబడి,అసెంబ్లీలో సీఎం,మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి స్థానిక శాసనసభ్యులు మందుల సామేలును వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ మేరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వం అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను డిమాండ్లను నెరవేర్చాలని అనేక ఆందోళన పోరాటాలను సమ్మెలు చేసినప్పటికీ స్పందించలేదని అన్నారు.నియోజకవర్గంలోని అద్వానంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయించాలని, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాలను అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మించి అన్ని గ్రామాలకు బస్సు వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, పార్టీలకు, కులమతాలకు అతీతంగా ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకు అందేలా చేయాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులను, మున్సిపల్ కార్మికులను, ఆశా వర్కర్లను,అంగన్వాడీ ఉద్యోగుల, మధ్యాహ్న భోజన కార్మికుల,హమాలీ కార్మికుల,ఇతర రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగులకు వేతనాల పెంపు, పని భద్రత, ఇన్సూరెన్స్ ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆశపెట్టుకొని ఎదురుచూస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు,జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం, మండల కార్యదర్శులు వజ్జే శ్రీనివాస్, గుమ్మడవెల్లి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.