
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో మీసాల మల్లయ్య ప్రమాదవశాత్తు కాలుజారి పడడం వల్ల కాలు విరిగింది. రెక్కడేతేగాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చేదోడు వాదోడుగా జీవనం సాగిస్తున్న మీసాల మల్లయ్య ప్రమాదవశాత్తు కాలు విరగడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయాన్ని గ్రహించిన సీపీఐ(ఎం) పార్టీ పంతంగి గ్రామ శాఖ మీసాల మల్లయ్యకు అండగా నిలిచింది. రూ.5000 రూపాయలు ఆర్థిక సాయం చేసివారి కుటుంబాన్ని ఆదుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి అంతటి అశోక్ గౌడ్, రత్నం శ్రీకాంత్, చిరిక సంజీవ రెడ్డి, బోయ యాదయ్య, రోడ్డ భగత్, నక్క లింగస్వామి, నేరేడు మహేష్, బర్రె రాజ్ పెరియర్, సుక్క రమేష్, సుక్క లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.