
అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతం,శ్రామిక వర్గ విజయానికి ‘మేడే’ చిహ్నమని సీపీఐ,(ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని సీఐటీయూ – సీపీఐ(ఎం ) మండల కమిటీల ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. హమాలి అడ్డ,జీసీసీ, పంచాయతీ,బిల్డింగ్ వర్కర్స్ ,పెయింటర్ వర్కర్స్ ,ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కార్మికులు ఆధ్వర్యంలో సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ దోపిడీకి వ్యతిరేకంగా 8 గంటల పని దినం కోసం కార్మికుల హక్కుల రక్షణకై ఆనాటి అమరవీరుల త్యాగ ఫలితమే నేడు కార్మికుల అనుభవిస్తున్న చట్టాలు ,హక్కులని అన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బిజెపి మోడీ సర్కార్ గత 15 ఏళ్ళుగా హరించి వేస్తుందని,పనిభారం పని గంటల పెరుగుదల స్వదేశీ విదేశీ బడా కార్పోరేట్లుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు కార్మిక చట్టాలను సవరించింది అని కొన్ని చట్టాలను రద్దు చేసిందని అన్నారు.మే డే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు హక్కులను రక్షించుకోవాలని మతోన్మాద విచ్చినకరశక్తులుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చిరంజీవి,సిఐటియు మండల కన్వీనర్ నరసింహారావు,అప్పన్న,ఏసు, నాగేంద్ర రావు,రవి,రజిని, వాణి,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.