నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 25 న మండల పరిధిలోని గుంటిమడుగు లో నిర్వహించే సీపీఐ(ఎం) అశ్వారావుపేట మండల మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం గుంటిమడుగు లో పార్టీ గ్రామ శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల పోరాటం, గిరిజనుల హక్కుల రక్షణ ముఖ్యపాత్ర పోషిస్తున్న సీపీఐ(ఎం) ఈ ప్రాంతంలో ప్రతిష్ట ఉందని,దానికి తగ్గా విధంగా మండల మహాసభలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చిరంజీవి, ప్రసాద్, మురళీ, శ్రీ వేణు, దామయ్య, కన్నయ్య తదితదరులు పాల్గొన్నారు.