
నమ్మిన సిద్ధాంతం మీద నిలబడుతూ కడదాకా కమ్యూనిస్టు బిడ్డగా బ్రతికిన ఒక ఆదర్శమైన కమ్యూనిస్టు ఈరోజు మన నుండి దూరం కావడం విచారకరమైన విషయం అని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండలంలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్టు ముద్దుబిడ్డ వర్డెళ్లి రాములు అంతిమయాత్రకు హాజరై ఆయన మాట్లాడారు.. రాములు బి.ఎన్.రెడ్డి ,మల్లు స్వరాజ్యం గార్ల సాన్నిత్యంలో ఉంటూ తుంగతుర్తి పరిసర ప్రాంతాలలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన చరిత్ర ఆయన సొంతమని కొనియాడారు. దున్నేవానికి భూమి గీసేవారిదే చెట్టు అంటూ భూస్వాముల ఆగడాలను ఎదిరించిన ధీరుడు అని అన్నారు. పార్టీలు ఎంతో మంది మారిన ఎన్నో ప్రలోభాలకు గురిచేసిన తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరిచి హక్కుల సాధన కోసం కడదాకా పోరాడిన వీరుడు అని అన్నారు. రాములు మరణం పార్టీకి తీరని లోటని ఆయన భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు భవిష్యత్ తరానికి ఆదర్శప్రాయంగా ఉంటాయని అన్నారు. వారి కుటుంబానికి సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు .ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు ,జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, పులుసు సత్యం, కందాల శంకర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషన్ రావు, తుంగతుర్తి వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, ”సీపీఐ(ఎం) పార్టీ నాయకులు పల్లా సుదర్శన్ ,తాటి విజయమ్మ, ఓరుగంటి అంతయ్య, ముత్తయ్య, ఎల్లయ్య ,జోగునూరి దేవరాజ్, బోనాల వెంకన్న, జడ్చర్ల లింగయ్య గ్రామ సర్పంచ్ బంధుమిత్రులు పాల్గొన్నారు..