– నివాళులు అర్పించిన జిల్లా నాయకులు పుల్లయ్య…
– పరామర్శించిన మండల కార్యదర్శి చిరంజీవి…
నవతెలంగాణ – అశ్వారావుపేట : సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యుడు కలపాల భద్రం మాతృమూర్తి ఆదిలక్ష్మి (90) ఆదివారం అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం లోని తన స్వగృహం లో వయోభారంతో కూడిన అనారోగ్యంతో మృతి చెందారు.ఆదిలక్ష్మి కి ఇరువురు కుమారులు భద్రం,బాబూరావు,ఇరువురు కూతుర్లు ఉన్నారు. భద్రం సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యుడి గా,బాబూరావు స్థానికత వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గం సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఆదిలక్ష్మి మృతి సమాచారం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.మండల కార్యదర్శి చిరంజీవి భద్రం కుటుంబ సభ్యులను పరామర్శించారు.వీరు ఇరువురు పార్టీ మండల కమిటీ తరుపున ప్రగాఢ సంతాపం ప్రకటించారు.