నవతెలంగాణ – అచ్చంపేట
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనీ సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశ్య నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారము సీపీఐ(ఎం) పార్టీ డివిజన్ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ్యా నాయక్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాంగానే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కల్పిస్తానన్న మోడీ ఉన్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి, రైల్వే, బ్యాంకు, రోడ్లు విమానయానం, ఉక్కు పరిశ్రమలు, ఇలాంటి భారీ పరిశ్రమలను సంస్థలను ప్రైవేటు కరించడం దుర్మార్గమని వారు అన్నారు. ఈ దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులకు రాయితీలు ఈ పది సంవత్సరాలక కాలంలో 11 లక్షల కోట్ల రూపాయలు రాయితీలుగా ప్రకటించారని, ఈ దేశంలో రైతు ఆరుగాలం కష్టపడి పండించే పంటకు గిట్టుబాటు ధర ఎంఎస్పి ఉండాలని ఢిల్లీలో లక్షలాదిమంది పోరాటం చేస్తుంటే నోరు మెదపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటం చేస్తున్న రైతుల పట్ల కర్కశంగా పోలీసులను పెట్టి దాడులు చేసి రైతుల ప్రాణాలను తీస్తున్న మోడీకి ఈ దేశ ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉండే రైతాంగం కార్మికుల పట్ల యువకుల పట్ల ఆలోచన చేయడం లేదని బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం వేల కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చే బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని అన్నారు. సర్వ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెట్టడమే వారి విధానం అన్నారు. ఇప్పటికైనా రైతాంగం, కూలీలు ,కష్టజీవులు, కార్మికులు, యువత బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఓడించడం కోసం కృషి చేయాలన్నారు. మతం పేరుతో బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేయడం తగదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ దేశం భారత రాజ్యాంగం పట్ల గౌరవంతో మెలగాలని హితుబోధన చేశారు. ఒకపక్క రాజ్యాంగం చెపుతూనే మరోపక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధానాల్ని అవలంబిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలోసీపీఐ(ఎం) పార్టీ జిల్లా నాయకులు శంకర్ నాయక్, సీపీఐ(ఎం) పార్టీ అచ్చంపేట మండల కార్యదర్శి మల్లేష్ , ఉప్పునుంతల మండల కార్యదర్శి నాగరాజు, నాయకులు లాల్ మహ్మద్, వెంకటయ్య సైదులు, లక్ష్మయ్య, రాములు, బక్కయ్య, శ్రీరాములు కృష్ణయ్య తదితరులు ఉన్నారు.