సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

CPI(M) wins Nalgonda District Mahasabhaనవతెలంగాణ – చండూరు  
డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో మిర్యాలగూడలో సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా మహాసభలను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం   తెలిపారు. ఆదివారం గట్టుప్పల మండల కేంద్రంలోని మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడలో డిసెంబర్ 2న భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరుకానున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీని నివారించడానికి, మతతత్వాన్ని ముందుకు రాకుండా ఇండియా బ్లాక్ ఏర్పాటు చేసి లౌకిక ప్రజాస్వామ్య విలువలతో కూడిన కూటమిని ఏర్పాటు చేసిందన్నారు. ఈ బీజేపీ సింగిల్ గా 400 స్థానాలు గెలుస్తా అని విర్రవీగిందని, ఇవాళ ఇతరుల మీద ఆధారపడి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఇక్కడ లౌకిక ఇండియా బ్లాక్ కమిటీ ఇక్కడ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే కాలంలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి, ఇండియా బ్లాక్ కమిటీ భాగంలో నైనా ఇక్కడ ప్రజా సమస్యల మీద సీపీఐ(ఎం) నిరంతరం పోరాడుతుందన్నారు. తెలంగాణలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలకు రైతు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఎకరాకు రూ.7500 ఇవే కాకుండా ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయన్నారు. అవి అమలుకు నోచుకోవడంలేదన్నారు. ధరణి సమస్యలు కూడా పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే సంస్కరణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల సమస్యలను సత్కరమే పరిష్కారం చేసే విధంగా పూనుకోవాన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్,, అచ్చిని శ్రీనివాస్, బోట్ట శివకుమార్ ,వల్లూరి శ్రీశైలం, టేకుమట్ల కృష్ణ, రావుల నరసింహ, పర్సబోయిన యాదగిరి, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములమ్మ ,తదితరులు పాల్గొన్నారు.