ఆలూరు మండలంలోని రాంచంద్ర పల్లి గ్రామంలో సీపీఐ(ఎం) శాఖ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు మండలంపర్తి కార్యదర్శి ఇ. సాయిలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని తెలిపారు. అందులో ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, మహిళలకు రూ. 2500, సంఘాలకు లోన్లు,అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి సుకన్య, భరతి, మౌనిక, గంగాధర్, నాగమణి, చిన్న లక్ష్మి, లక్ష్మిప్రియ, లావణ్య, భుమవ్వ, పార్టీ. సభ్యులు పాల్గొన్నారు.