
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు చిన్న కొండూరు గ్రామ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వడ్ల మార్కెట్ ను సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో సందర్శించారు. అధికారులు రైతుల వడ్లు కొనుగోలు చెయ్యకపోవడం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వడ్లు తడిసి మొలకెత్తితున్నాయి. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు 20,25 రోజుల నుంచి రైతులు కల్లాలలో వడ్లు పోసుకొని ఉన్న నేటికి కూడా ఐకెపి కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించలేదని తెలిపారు. ఐకెపి కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు రైస్ మిల్లులకు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని దుయ్యబెట్టారు. వెంటనే ఐకెపి కేంద్రాలను ప్రారంభించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్ని వడ్లకు కింటాలుకు రూ.500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి పార్టీ మండల కమిటీ సభ్యులు చింతల సుదర్శన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి నరసింహారెడ్డి, చీమ కండ్ల బుచ్చయ్య, తిగుల్ల మల్లయ్య, ఎస్ కే ఇబ్రహీం, ఘర్ష బుచ్చయ్య, ఘర్ష లింగస్వామి, నత్తి నరేష్, బక్క యాదయ్య, చెమకండ్ల రామచంద్రం, చాపల యాదయ్య, చాపల స్వామి, బోయిని పర్వతాలు, చెక్క ముత్యాలు, నత్తి బుచ్చయ్య, రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.