నిజామాబాద్ లో సీపీఐ(ఎం) పార్టీ మహాసభ ఈనెల 20న జరగనుందని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత తెలిపారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని నాందేవ్ వాడ సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూ స్థానిక సమస్యలు పరిష్కారం కోసం నిరసనలు, దీక్షలు, ఆందోళనలు, అనేక కార్యక్రమాలు చేస్తున్న సీపీఐ(ఎం) పార్టీ మహాసభ ఈ నెల 20న జరగబోతుందని తెలిపారు. ఈ మహాసభకు పార్టీ సభ్యులు, పార్టీ శ్రేయోభిలాషులు, ప్రజలు, పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు కటారి రాములు, నల్వాల నరసన్న, బొప్పని అనసూజ పాల్గొన్నారు.