కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. మతోన్మాదం ప్రజలపై ప్రభావం అంశంపై పట్టణంలోని టీఎన్జీవో భవన్లో మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ ఈ సరస్సు సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం ప్రభావం బాగా పెరిగిందని సమస్యలు గాలికి వదిలేసి మతాన్ని మతోన్మాదముగా ప్రేరేపిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కేవలం అధికారం కోసం అడ్డుపెట్టుకొని ప్రయత్నం బిజెపి చేస్తుందని అన్నారు రైతుల సమస్యలు పరిష్కారం చేయకపోగా మద్దతు గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంటులో పెట్టాలని గత సంవత్సర క్రితం రైతాంగ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ 13 నెలల పాటు రైతులు ఏకతాటిగా ఆందోళన నిర్వహించి మోడీ మెడలు వంచారని అన్నారు. ఉత్తర భారత దేశంలో బిజెపికి వ్యతిరేక పవనాలు వేసినప్పటికీ ప్రజా వ్యతిరేక విధానాలను ఆలంపిస్తుందని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో రైతాం రైతాంగానికి మద్దతు ధర చట్టాన్ని పార్లమెంటులో పెట్టకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. జిల్లాలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో గెలిపించినప్పటికిని మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసుపు బోర్డు ఊసే లేదని అన్నారు. కేంద్రం ప్రధానంగా రాముడి పేరుతో రాముడు విగ్రహ ప్రతిష్టాపన మోడీ చేసినప్పటికిని అక్కడ ప్రజలు బిజెపి ఎంపీ ని ఓడించాలని అది గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలపై ధరల సమస్యలపై చర్చించకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను సవరించినట్లయితే మతం పేరుతో కొనిమాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేసి గ్రామ గ్రామాన ప్రజలను చేతనవంతం చేసే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్ది వెంకట రాములు ,దేవారం, సూర్య శివాజీ సీపీఐ(ఎం) నాయకులు ఆరేపల్లి సాయిలు, సీపీఐ(ఎం) డివిజన్ కమిటీ సభ్యులు కొండ గంగాధర్,కు తాడి ఎల్లయ్య, భూమేశ్వర్, బి రవి, విట్టల్, నవీన్ బై, రమేష్ అంబులెన్స్ రాజు, లాల్య నాయక్, కొంతాబాయి, సాయిలు కల్లుబాయి, హసీనా, తదితరులు పాల్గొన్నారు.