సీపీఐ(ఎం) రెండో జాబితా విడుదల

– రెండు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
– నల్గొండ నుంచి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి
– హుజూర్‌నగర్‌లో మల్లులక్ష్మి పోటీ
నవతెలంగాణ-మిర్యాలగూడ
అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం విడుదల చేశారు. ఇద్దరు పేర్లతో కూడిన జాబితాను ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ నుంచి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్లను ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడతలో 14 మందిని ప్రకటించగా రెండో జాబితాలో ఇద్దరిని ప్రకటించారు. సీపీఐ(ఎం)16 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. నేడు కోదాడ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించనున్నారు. మునుగోడు నుంచి కూడా పోటీ చేసే ఆలోచన ఉందని అక్కడ సీపీిఐ పోటీ చేస్తే ఆ పార్టీకి మద్దతిస్తామని తమ్మినేని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుండి ఇప్పటికే ఐదుగుర్ని ఖరారు చేశారు. మరో ఒకటి రెండు స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశముంది. ఆ జాబితా కూడా త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.