తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి:సీపీఐ(ఎం)

నవతెలంగాణ – తుంగతుర్తి
గత మూడు రోజుల నుండి కురుస్తున్న తుఫాను వలన రైతులు పండించిన ధాన్యం ఐకెపి కొనుగోలు కేంద్రాలలో పోసినవి తడవడం ద్వారా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే అధికారులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తడిసిన ధాన్యాన్ని కోతలు వేయకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు కోరారు. గురువారం  తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు అన్నారం, వెంపటి గ్రామాల్లోని ఐకెపి సెంటర్లను పరిశీలించిన సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. ఎంతో శ్రమకోర్చి పండించిన పంట తీరా చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలకు పంట నష్టపోవడం చేత రైతులు తీవ్రమైన నిరాశతో ఉన్నందున వెంటనే కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా నాయకుడు బుర్ర శ్రీనివాసు, రైతు సంఘం జిల్లా నాయకుడు పల్లా సుదర్శన్, ముత్తయ్య, నరసయ్య, లింగయ్య ,రాములు, వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.