సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బస్వాపురం రిజర్వాయర్ కు రూ.500 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, ముంపునకు గురైన నిర్వాసితులకు వెంటనే పూర్తి స్థాయిలో నష్టపరిహరం చెల్లించి, పునరావాసం కల్పించి, ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. శుక్రవారం మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో సీపీఐ(ఎం) భువనగిరి మండల 8వ మహాసభ కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి నగర్, కామ్రేడ్ కొల్లూరి పోచయ్య, కామ్రేడ్ బండారి యాదగిరి ప్రాంగణంలో పల్లెర్ల అంజయ్య, దయ్యాల లక్ష్మి అద్యక్షత జరుగగా మహాసభ ప్రారంభ సూచికంగా సీనియర్ నాయకులు పాండాల మైసయ్య పార్టీ జెండాను ఆవిష్కరించినారు అనంతరం సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరియు అమరవీరులకు సంతాపాన్ని ప్రకటిస్తూ నివాళులు అర్పించినారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా జహంగీర్ గారు పాల్గొని మాట్లాడుతూ బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణ కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతో రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావడం లేదని రిజర్వాయర్ కు సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వాం వెంటనే తెలియజేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న బస్వాపురం రిజర్వాయర్ ను వెంటనే పూర్తి చేసి జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి సాగు నీరు అందించాలని కోరారు. అదేవిధంగా రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న బి.ఎన్ తిమ్మాపురం, లప్పానాయక్ తండ, చొక్లా తండ ముంపు బాధితులను మరియు బస్వాపురం గ్రామాంలో భూములు కోల్పోయిన వారికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని , ఇల్లు కోల్పోయిన వారికి వెంటనే ఇండ్ల నిర్మాణం చేపట్టి వెంటనే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేసి వడపర్తి కత్వను వెడల్పు చేయాలన్నారు.
వడపర్తి కత్వా ద్వారా భువనగిరి పెద్ద చెరువు, బీబీనగర్ చెరువులను నింపి భువనగిరి, బీబీనగర్ మండలాలతో పాటు జిల్లాలోని 9 మండలాలకు సాగునీరు అందించాలని అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు పూర్తిచేసి భూనాది గాని కాలువదారు గోదావరి జల్లాలు అందిస్తే మూసీ కాలుష్యాన్ని నివారించవచ్చు అని అన్నారు. మండల వ్యాప్తంగా భూములు సేద్యం చెసుకుంటున్న పేదలకు, దళితులకు ప్రభుత్వం వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని, ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, మండలంలో భూ పంపిణీ నిషేధం ఎతివేసి భూమి లేని పేదలకు మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని, మండలంలోని అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు చేపట్టాలని, మండలంలోని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు పాల్గొని మాట్లాడగా ఇంకా మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు , మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, కొండ అశోక్ , కొండమడుగు నాగమణి, మండల కమిటి సభ్యులు సిల్వేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, పాండాల మైసయ్య, ఎల్లయ్య, కొండాపురం యాదగిరి, చోక్క కుమారి, దయ్యాల మల్లేష్ లు పాల్గొన్నారు.