పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: సీపీఐ(ఎం)

Abandoned lands should be given titles: CPI(M)– పెండ్లి వాగు మీద లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పునరుద్దరించి, అక్కడి వ్యవసాయ భూములకు సాగు నీరు అందించాలి
– సీపీఐ(ఎం) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట రెడ్డి 
నవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన లింగాల గ్రామంలోని ఆదివాసి రైతుల,పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పెండ్లి వాగు మీద లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రోత్సహించి వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం లింగాల గ్రామంలోని సీపీఐ(ఎం) పార్టీ శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా మండల కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి లు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు కొంతమంది రైతులకు మాత్రమే పట్టాలు ఇచ్చిందని, ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉందని, అంతేకాకుండా ఆదివాసులతో సహజీవనం చేసుకుంటున్న గిరిజనేతరులకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. 2003 సంవత్సరం లింగాల గ్రామంలో పెండ్లి వాగు మీద, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించారని, ఆ పనులు పూర్తికాకుండానే మధ్యలోనే నిలిపివేశారని ఆయన మండిపడ్డారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తే సుమారుగా 200 ఎకరాల కు సాగునీరు అందుతుందని, త్వరగా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పునరుద్ధరించి సాగునీరు అందించాలని తెలిపారు. తే కాకుండా లింగాల గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదని, రోడ్డు వేసి రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. కొడిశల, లింగాల గ్రామాల మధ్యలో సుమారు 7 కిలోమీటర్ల రోడ్డు కంకర పోసి నిలిపివేశారని ఆయన మండిపడ్డారు. ఆ రోడ్డు మార్గాన యాక్సిడెంట్ అవుతున్న ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బీటీ రోడ్డు పనులు నాణ్యతగా తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ శాఖ మహాసభలో శాఖ కార్యదర్శిగా కోరం రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఊకె ప్రభాకర్, ఊకె నాగేశ్వర్ రావు, జన్ను ఎల్లయ్య, పెనక కాంతారావు, ఊకె సమ్మక్క, పూనెం సుధాకర్, పాయం నారాయణ, తోలేం చంద్రయ్య, కోరం సారయ్య, పెనుక ఉపేంద్ర , పూనెం అబ్బయ్య, జన్ను చంద్రకళ, చాపల పెంటమ్మ, కోరం సునీత, ఊకె సుమలత తదితరులు పాల్గొన్నారు.
https://navatelangana.com/cpim-should-give-title-to-waste-lands/