– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్
నవతెలంగాణ – వలిగొండ రూరల్
అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, ఇండ్లు లేని పేదలందరికీ వెంటనే ఇండ్లను మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. శనివారం రోజున మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సీపీఐ(ఎం) పోరుబాట కార్యక్రమం సందర్భంగా గ్రామంలో సర్వే నిర్వహించారు. గ్రామంలో అనేకమంది పేదలకు సరైన ఇంటి వసతి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పులిగిల్ల గ్రామంలో అనేకమంది పేదలకు నేటికీ సొంత గూడు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వారందరికీ ఇండ్లను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. అదే విధంగ పటేల్ కుంట నుండి రాముని చెరువు వరకు గల కాలువకు మరమ్మత్తులు చేపట్టాలని కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని,చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల అందరికీ వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,సహాయ కార్యదర్శి మారబోయిన నరసింహ, నాయకులు వడ్డమాని వెంకటయ్య, దొడ్డి యాదగిరి,వేముల అమరెందర్, బొడ్డు రాములు,వేముల ముత్తయ్య,మారబోయిన ముత్యాలు వడ్డమాని మధు,వేముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.