షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీని అమలు చేయాలి: సీపీఐ(ఎం)

Loan waiver should be implemented for all farmers without conditions: CPI(M)– జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు
నవతెలంగాణ – నూతనకల్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు లక్షల రుణమాఫీ ని ఎటువంటి షరతులు లేకుండా రుణాలు తీసుకున్న రైతులందరికీ వెంటనే మాఫీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో కామ్రేడ్ తొట్ల  మల్సూర్  స్మార క భవనంలో సీపీఐ(ఎం) మండల నాయకులు బొజ్జ శీను అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొి మాట్లాడుతూ..  రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను గందరగోళ పరిస్థితికి తెచ్చిందని అన్నారు. మంత్రులు ఇచ్చే ప్రకటనలో స్పష్టమైన వైఖరి లేదు అని విమర్శించారు.  రాష్ట్రంలో 40% రైతులకు మాత్రమే రుణమాఫీ అందిందని  అప్పు ఇచ్చినప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక కారణాలతో తప్పించుకోవాలని చూస్తున్నదినీ అన్నారు. ఈనెల 29న  తహసిల్దార్ కార్యాలయం ముందు జరిగే  ధర్నాను రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి మండల నాయకులు అంజి పెళ్లి లక్ష్మయ్య గాజుల జానయ్య గాజుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.